![]() |
![]() |

పుష్ప హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ అంటే ఆడియన్స్ కి ఒక మోస్తరుగా బాగానే తెలుసు. హీరోగా చాలా మూవీస్ చేసాడు కానీ అనుకున్నంత పేరు రాలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదే టైంలో ‘ఆలీతో సరదాగా’ టాక్ షోకి వచ్చాడు. ఎవరికీ తెలియని కొన్ని ఇంటరెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. "ఏమిటి ఎక్కువగా ఈమధ్య ముంబై వెళ్తున్నావ్..కోడల్ని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నావా" అని ఆలీ అనేసరికి "అలాంటిదేమీ లేదు" అని నవ్వేసాడు శిరీష్. కొత్త మూవీలో లిఫ్ట్ లో వచ్చే ముద్దు సీన్ గురించి ఆలీ , శిరీష్ ని అడిగాడు. " యూత్ కి ఈరోజున ఇదంతా చాలా మూములు విషయం" అని అల్లు శిరీష్ చెప్పాడు. "ఈ ముద్దు సీన్ సింగిల్ టేక్ లో అయిందా లేదా ఎన్ని టేకులు అయ్యింది" అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలీక శిరీష్ తల పట్టుకున్నాడు.
ఇక ‘పుష్ప’ రిలీజ్ సమయానికి తాను ముంబై లో ఉన్నానని చెప్పాడు. "నేను అల్లు అర్జున్ తమ్ముడినని తెలియదు కాబట్టి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటుంటే పక్కనే కూర్చుని విన్న నాకు చాలా హై ఇచ్చిందని" శిరీష్ చెప్పాడు. "తన ఫస్ట్ మూవీ "గౌరవం" 98 శాతం మందికి నచ్చలేదని, ఒకవేళ ఆ మూవీ బాగుందని ఎవరైనా చెబితే మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నా" అని చెప్పాడు. "తన భార్య స్నేహకి చెప్పని సీక్రెట్స్ కూడా కూర్చోబెట్టి నీకు చెప్తాడట కదా అవి ఏంటి" అని ఆలీ అడిగేసరికి "ఎవరో ఒకరికి మైండ్ లో ఉన్నవి షేర్ చేసుకోవాలి కాబట్టి నాతో చెప్తాడు. ఐతే మా వదిన స్నేహ గన్ పెట్టి అడిగినా సరే చెప్పలేను" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.
![]() |
![]() |